ఆ. వె. మాట మంచిగున్న మనసు కంపుగ నుండు

ఆ. వె 
మాట మంచి గున్న మనసు కంపుగనుండు
వాని పనులు నమ్మ వలదు వలదు
నీతి మంతు డెపుడు నిర్మలంబుగ నుండి
మేడి పండు లాగ మెరవ డెపుడు!! 

భావం. కొందరు బయట మాటలు మాత్రం మంచిగా మధురంగా మాట్లాడతారు కానీ  లోన మనసు మాత్రం కంపు కొట్టుచూ ఉంటుంది స్వార్థపు దురాలోచనలుతో అటువంటి వాని పనులు నమ్మ కండి, అలాగే  నీతి పరుడు ఎప్పుడు నిర్మలంగా ఉంటాడు డాంబిక మైన మాటలు చెప్పడు మనసు లోన కుళ్ళు బెట్టు కోడు అంటే మేడిపండు లాగ బైట నున్నగా లోన పురుగులున్నట్లు ఉండడు.

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి