గోపాల నంద గోపాలా

ఓం
గోపాల కృష్ణ సంకీర్తన

గోపాలా నంద గోపాలా గోకుల బాలా గోపాలా

పండరినాథా గోపాలా పుండరి కాక్షా గోపాలా 
పంకజ నేత్రా గోపాలా పాలింపూ మము గోపాలా
దేవకి పుత్రా గోపాలా దేవాది దేవ గోపాలా
మోక్ష దాయకా గోపాలా మ్రొక్కేద నీకు గోపాలా ll

పార్థ సారథి గోపాలా పాపవినాశా గోపాలా
మునివంద్యాయ గోపాలా మురహరి దేవ గోపాలా
సాధు సంరక్ష గోపాలా సకల జ్ఞానా గోపాలా
సంసారార్ణవ గోపాలా సర్వమ యాయ గోపాలా ll

మురళిగాన ప్రియ గోపాలా ముక్తి దాయక గోపాలా
చిన్మయ రూపా గోపాలా మాచింత బాపవే గోపాలా
భగవద్రూపా గోపాలా భవ్య చరిత్ర గోపాలా
భాగవత ప్రియ గోపాలా భక్త వత్సలా గోపాలా ll

2 వ భాగం

గోపాలా నంద గోపాలా గోకుల బాలా గోపాలా

యశోద నంద గోపాలా యాదవ మకుట గోపాలా
మురళీలోలా గోపాలా ముకుంద మాధవ గోపాలా
ధరణీ నాథ గోపాలా దైవ శిఖామణి గోపాలా
దీనరక్షకా గోపాలా దిక్కు నీవెయా గోపాలా ll

శ్యామసుందర గోపాలా శాంతమయాయ గోపాలా
రాధారమణా గోపాలా రాక్షసాంతక గోపాలా
కంసమర్ధన గోపాల కారుణ్యాలయ గోపాల అనాధనాథ గోపాల అభయ హస్త గోపాల ll

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం