ఇంద్ర నీలమణి కృష్ణ గానం
ఓం
ఇంద్ర నీల మణి వర్ణా కృష్ణా
మా మదిలో నుండగ రారా కృష్ణా
అష్టమి తిథి నీకు ఇష్టము ఎట్లాయే
దేవుడవని యెంచి బుట్టితివా నీవు
కారాగారమె నీకు పురిటిల్లు నెంచితి వేల
తండ్రితోన గాడిద కాళ్ళు బట్టించితి వేల
యాదవ కులమెట్లు ఎక్కువనిపించే
పశువుల కాపరిగా పని మెచ్చె నేరీతి
గోపకాంతల గోల నీకు ప్రియ మెట్లాయే
వ్రేపల్లె వాడ పెద్ద పట్నమని పించే నెట్లా l l
రచన వై. నాగరంగయ్య
Comments
Post a Comment