పాలించు మము దేవ పాలించు తండ్రి
ఓం
పాలించు మము దేవ పాలించు తండ్రి
పాలకడలి శయణ మమ్ము పాలించు l l
పతిత పావన దేవ పద్మావతీ విభో
పాలించు మము దేవ పంకజ దళనేత్ర l l
కళ్యాణగుణ ధామ కరుణాంతరంగ
కంస వైరీ మమ్ము కాపాడు తండ్రి l l
పదునాల్గు లోకాలు మోయగల్గిన నీకు
నాదు భారము నెట్లు బరువయ్యే తండ్రి l l
Comments
Post a Comment