అంబికా తనయుడు
ఓం
అంబిక తనయుడు ఆ గజా వడనుడు
అందరికి ముందు పూజ గొను వాడు
భక్త జనవాసుడు సిద్ధి గణనాథుడు
మరుగుజ్జు వాడు మమ్మేలు వాడు l l
నాగయజ్ఞోపుడు నారద వంద్యుడు
మోదక ప్రియుడు మోహన రూపుడు
మూషిక రూడుడు మునిజనారాధ్యుడు
గజముఖ వదనుడు గణపతి దేవుడు l l
పత్రి పూజా ప్రియుడు పశుపతి సుతుడు
ఆశ్రిత వరదుడు అందరికి వేల్పుడు
వరసిద్ధి నాయకుడు వసుధ గణనాథుడు
చవితి పూజా ప్రియుడు చేరదీసెడి వాడు
Comments
Post a Comment