శివ గానం
ఓం
పరమేశ్వర శివ పరమేశ్వర
పార్వతీ వల్లభ పరమేశ్వర
పరమునకు నేనేపుడు పాటు బడలేదు
పరమేశ్వర పాహి పాహి యన లేదు
శ్రద్ధగా నీజపము జేయ లేదు
దండిగా దానములు ఇవ్వ లేదు
హఠ యోగములు అభ్యసించ లేదు
అమరకోశము దిరగ వేయ లేదు
ధర్మ మెన్నడును ఆచరించ లేదు
భక్తితో భజనెపుడు చేయలేదు
తీర్థయాత్రలు నెపుడు తిరగ లేదు
ఏకాదశీ వ్రతము చేయలేదు
యందులోనా నిన్ను వెదక లేదు
ఏమి చేయని నన్ను ఏలుకోవేమి.
Comments
Post a Comment