అప్పా అప్పా అప్పా
ఓం
అప్పా అప్పా అప్పా
శ్రీ గురువాయూరప్పా
గుట్టుగ ఉన్నా వేమప్పా
మాకంటికి కనిపించప్పా
వెంకట తిరుమల యప్పా
మా బాధలు దీర్చ వేమప్పా
నీ కొండకు రాలే మప్పా
మా వద్దకు దిగిరా వప్పా
శ్రీ లక్ష్మీ నరసింహప్పా
మా మోహము దొలగించప్పా
మా వేదన వినుమో యప్పా
మా పాల దేవుడవు నీవప్పా
భద్రాచల శ్రీ రామప్పా
ఈ దాసుని కరుణించప్పా
నాతప్పులు మన్నించప్పా
లక్ష్మీ నారాయణప్పా
శ్రీపతి గోవిందప్పా
చిక్కక యున్నా వేమప్పా
చిక్క దలచుకో చెన్నప్పా
చిలిపి తనాల కృష్ణప్పా.
Comments
Post a Comment