వ్రేపల్లె ధాముడు యశోద తనయుడు

వ్రేపల్లె ధాముడు యశోదా తనయుడు
ద్వారక నిలయుడు ధరణీ నాథుడు l l

యోగుల కీశుడు భక్తుల కభయుడు
మునులకు ముక్తుడు జనులకు దేవుడు
అసురాంతకుడు శరణాగతుడు
సకలాధీశుడు సర్వ వ్యాపకుడు l l

సకలారాద్యుడు సర్వాతీతుడు
సృష్టికి కారణుడు సుజనా పాలుడు
గానవి లోలుడు గజరక్షకుడు
గోకుల బాలుడు గోవింద దేవుడు l l

రాధారమణుడు రమ్య చరిత్రుడు
పాండవ పాలుడు పశు పాలకున్డు 
శిఖిపించము వాడు శివ చైతన్యుడు
పురుషోత్తముడు తులసి మాళ ప్రియుడు l l

రచన--యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం