ఏడుస్తూ ఉన్నాది హృదయం

ఏడుస్తూ నున్నాదీ  హృదయం ఏడుస్తున్నదీ 
నా హృదయం ఏడుస్తున్నాదిl l 

తల్లిదండ్రుల జూచు 
        తనయుళ్లు కరువాయి
వృద్దులాశ్రమాలు 
          ఊరూర బుట్టెనే l l 
     
ఆలుమగలయందు 
     అనురాగం కరువాయే
మాట మాటా పెరిగి 
     విడాకు లాయేనే l l 

నమ్మకముగ జేయు 
       పనివారు కరువాయే 
కాపు కాచువాడే 
     దోచు వాడాయెనే l l 

ప్రజల మేలుగోరు 
     ప్రభువులు కరువాయే 
పథకాలు ప్రకటించి 
      ప్రజలను దోచిరే l l 

రచన & గానం 
యలిగండ్ల నాగరంగయ్య 
తాడిపత్రి

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం