తోగత వీర లేవరా
పల్లవి ||
తొగట వీర క్షత్రియుడ లేవరా లేవరా
బడుగు బతుకు వీడరా ముందుకడుగు వేయరా ||
మూడువందలరుబది వీరుల వారసుడివిరా
నీదు వంశ వారసుల వీర ఘణత చాటరా ||
సకల దేవతలకును సర్వ మానవులకును
బట్టలు నేసిచ్చి నీవు బడుగున జీవించి నావు ||
మనుజ జాతి శీలమును గాపాడిన వాడివిరా
జయవిజయము జెప్పుచూ జెండా ఎగరేియుమురా ||
చట్ట సభలలోన ప్రతి ఘటణను చాటరా
శాసన మండలిలోన హక్కును సాధించ రా ||
Comments
Post a Comment