చల్లని చూపుల నల్లని తల్లి
ఓం
చల్లని చూపుల నల్లని తల్లీ
చల్లంగ చూడవె చాముండికా దేవి.
గణపతి దేవుని గన్నా ఓ జననీ!
గరళకంఠ సతీ గాయత్రి దేవి
ఆది మహా తల్లి అజ్ఞాన నాశిని
ఆదరించవె నన్ను ఆదిపరాశక్తి
ఆదిబిక్షునికి అన్నము బెట్టిన
అఖిలలోక జనని అన్న పూర్నే
తారకాసుని జంపిన తల్లి
త్రైలోక్య జనని తప్పు లెంచకె నన్ను
ఆదికుటుంబిని అఖిచరాత్మని
అమృత వల్లీ యభీష్ట దాయిని
శ్రీ కల్పవల్లీ శివసుందరేసి
శ్రీ చక్రవాసిని సిద్ది ప్రదాయిని .
Comments
Post a Comment