ఎరుక లమ్మ తల్లీ

ఓం
ఎరుకలమ్మ తల్లీ ఎపుడు మతికుండవే
మరపులమ్మ నీవు మమ్మొదలి వెల్లువె తల్లీ.||

పేదరాశి పెద్దమ్మా నిరుపేదనో యమ్మ
ఎల్లమ్మ మమ్మేలు యెల్లలోకాల తల్లి
కొండరాజ కూతురా కొడుకునే యమ్మ నీకు 
షణ్ముఖ గణనాథాంభ సల్లంగ సూడవమ్మా ||

మల్లమ్మ మన్నించు మాతప్పు లన్నియు
కామాక్షి కరుణించు కడపటి వాడను తల్లీ
విశాలాక్షి విన్న పాలు వినిపించు కోయమ్మ
కావవే కావవే తల్లీ కన్యాకుమారి జననీ ||

మధుర మీనాక్షి తల్లీ మముజూడవే యమ్మ
బ్రోవవే బ్రోవవే మమ్ము బోనాల పూజల తల్లీ
చంద్ర మౌళీశ్వర పత్నీ శరణు శరణే జననీ
మంగళ గౌరీమ తల్లీ మాకు గతివి నీవే తల్లీ ||

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం