నరసింహ నరసింహ నారాయణ
ఓం
నరసింహ నరసింహ నారాయణ
నన్నె త్తు కో తండ్రీ నారాయణ
నిఖిల లోక పాల నీబిడ్డ నేకాన
నన్నేల విడిచితివి నారాయణ తండ్రీ ||
ముళ్ల కంపల సంసార త్రోవన నేను
నడవ లేకున్నను నడవ లేకున్నాను
కంటికి కనరాని కారడవి చీకటిలో
నే నడవ లేనయ్య నే నడవ లేను ||
ఆలుసుతులు ఇల్లు వాకిలి యంటు
ముగియింపు లేని సంసార కథనాన
ఆశపాశముల ఈ అగ్ని గుండమున నే
నడవ లేకున్నాను నాతండ్రి నళినాక్ష ||
వదిలి పెట్టకు స్వామి వందనాలు
వదిలితే నే బాధ పడలేను తండ్రీ
నీమీద పరిభక్తి నాలోన కలిగించి
నన్ను బ్రోవుము తండ్రి నార శింహ ||
రచన వై. నాగరంగయ్య
Comments
Post a Comment