అలంపూర్ జోగు లాంభ
అలంపూర్ జోగులాంభ
అంభ ఓ జననీ అంభ ఓ జననీ
కుమార గణనాథాంభ
కూడదనకె నన్ను కూడదనకు తల్లీ.
బాల బ్రహ్మేశ్వర పత్నీ
బండాసుర వర్ధిని
సదాశివ సుందరీ
సరిగ చూడవే నన్ను సరి చూడు తల్లీ.
తుంగానది తీర్థ నివాసి
తులతూగు వైభవతీ
కామితార్థ ప్రధాయినీ
కరుణజూడవే తల్లీ కరుణించు మమ్మా.
6
శక్తి పీఠ సుస్థిర దాయినీ
శరణు శరణు తల్లీ
కామేశ్వర కామకేళి
కళ్యాణ మంగళ గౌరీ కళ్యాణ మంగళ గౌరీ.
శ్లో ||
లంభస్తనీం వికృతాక్షిం
ఘోరరూపం మహా బలాం
ప్రేతాసన సమారూడాం
జోగులాంభాం నమామ్యహం.
Comments
Post a Comment