N T రామారావు పాట
ఓం
సీస పద్య మాలిక
నటనకు రారాజు నందమూరి నొకడె
తెలుగు చిత్రము నందు తేజ రిల్లె
గంభీర నటనతో గగన వీధిన వెల్గి
శ్రోతల హృదయాల చోరు డయ్యె
ఘణ ఘణాయని కంచు గాంభీర్య గొంతుతో
రంజింప నటకళా రాధ్యు డయ్యె
రాముడైనను మరి రావణుం డైనను
బిక్ష పాత్రను యైన భీము డైన
తండ్రిగా నొకపక్క కొడుకుగా నొకపాత్ర
అవలీల గాజేసె అప్పుడపుడె
పట్టుదల విడని గట్టి యోధుడతడు
కర్తవ్య మున తాను కర్మ యోగి
తే.
వెండి తెరమీద భానుడై వెలిగి తాను
సాటి లేడన్చు నటుడుగా స్వర్గ మొందె
అట్టి విఖ్యాత నటగాత్ర అవని యాంధ్ర
తెలుగు దేశము పార్టీని తేజ పరచి
అనతి కాలముననె ముఖ్య మంత్రి యయ్యి
రామ రాజ్యమె ననునట్లు రాజ్య మేలె ll
రచన & గానం
వై. నాగరంగయ్య
తాడిపత్రి 9866068240
Comments
Post a Comment