తే || మహిత మందున శివరాత్రి మహిమ చాల గొప్పదనుచు పుణ్య కథలు చెప్పు చుండ మోక్ష ఫలమీయ శివరాత్రి ముందు నడుచు భవుని సతతంబు పూజించు భక్తి తోన l l ఆ.వె|| జంగ మయ్య నీకు జగమున సరిసాటి దేవు డేందు లేడు దిశల లోన పరమ పావన హర పరిపూర్ణ భక్తితో లింగ పూజ చేయ లేదు జన్మ l l ఆ.వె శి వుని పూజ తోన శివరాత్రి గడిపితే వ సుధ లోన ముక్తి వచ్చు మనకు రా త్రి కాల మంత రామేశ్వరుని గొల్వ త్రి దళ పూజ ప్రియుడు వదల డెపుడు ll తే.గీ వశుధ శివరాత్రి చేసిన వార లంత శివుని సన్నిధి చేరిరి చింత లుడిగి వల్ల కాటిల్లు పార్వతీ వల్ల భుండు భక్త జనులకు ముక్తుడు భవుడు ఆ. వె సకల జీవులందు సర్వలోకము లందు నంత రాత్మ యైన నాది దేవ గంగ జలము తోన లింగార్చనలు చేసి నిన్ను గాంతు మయ్య నీల కంఠ l l
ఓంశక్తి ఓంశక్తి ఓంశక్తి ఓం ఓంశక్తి ఓంశక్తి శివ శక్తి ఓం ఇచ్ఛాశక్తి క్రియాశక్తి ఓం శక్తి ఓం జ్ఞానశక్తి యజ్ఞ శక్తి ఓం శక్తి ఓం ప్రాణ శక్తి ప్రభుః శక్తి ఓం శక్తి ఓం క్షమా శక్తి దమా శక్తి ఓం శక్తి ఓం మంత్ర శక్తి మహా శక్తి ఓం శక్తి ఓం ఇంద్ర శక్తి చంద్ర శక్తి ఓం శక్తి ఓం రవి శక్తి రామ శక్తి ఓం శక్తి ఓం కాల శక్తి కరుణ శక్తి ఓం శక్తి ఓం దయా శక్తి దమయః శక్తి ఓం శక్తి ఓం విద్యా శక్తి వినయః శక్తి ఓం శక్తి ఓం ఆత్మ శక్తి ఆజ్ఞః శక్తి ఓం శక్తి ఓం బ్రహ్మ శక్తి విష్ణు శక్తి ఓం శక్తి ఓం పృద్వి శక్తి జల శక్తి ఓం శక్తి ఓం వాయు శక్తి వరుణః శక్తి ఓం శక్తి ఓం అగ్ని శక్తి ఆది శక్తి ఓం శక్తి ఓం తత్వ శక్తి తపో శక్తి ఓం శక్తి ఓం. ఓంశక్తి ఓంశక్తి ఓంశక్తి ఓం ఓంశక్తి ఓంశక్తి శివ శక్తి ఓం రచన Nagarangaiah Y
ఆ కళ్ళలో కనిపించేదంతా కరణారసం ఆ హుందాతనంలో ఉన్నదంతా దేశభక్తి ఆయనొక అద్భుత శక్తి ధైర్యానికి చిరునామా అజాగ్రత్తకు అలసత్వానికి చోటుండని వ్యక్తిత్వంగల అగ్ని శిఖ ఆయన నిరంతర సత్యశోధనే ఆయన లక్ష్యం ప్రతిమనిషి శక్తి వంతుడే తప్ప శక్తి హీనుడు కాడు అన్నదే ఆయన నినాదం మరుగున నిద్ర పోతున్న శక్తిని మేలుకొలుపుమని యువతకు ఇచ్చిన మెరుపు తీగల్లాంటి దివ్య సందేశం ఆయనది. భారతదేశ సనాతన ధర్మ నిధిని విదేశాలకు పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అట్టి మహానుభావుని మనసా వాచా కర్మణా స్మరిస్తూ యలిగండ్ల నాగరంగయ్య.
Comments
Post a Comment