నిటలాక్షున్ డిపుడెత్తి
మత్తేభం
నిటలాక్షుండిపుడెత్తివచ్చినను రానీ,
యన్నదమ్ముల్ ననున్
నిటతాటంబుగబాసిపోయిననుపోనీ, కృష్ఢుడేవచ్చివ
ద్దిటుపార్థాయననీ, మరేమయినగానీ,
లోకముల్ పటుదర్పంబుగనిల్పి,యీ గయుని ప్రాణంబేను రక్షించెదన్.
తేటగీతి
దర్పముగలడనంచు నే దలపలేదు
పూర్వమైత్రిని తలపక పోవలేదు
మాన ధనుడనగుట నీకు మరదినగుట
తలచినాడను క్షత్రియ ధర్మ మొకటి .ll
Comments
Post a Comment