పూజ చేయ రండి గురుపూజ
ఓం సద్గురు సచ్చిదానంద మూర్థయే నమః
--------------------------------------------------------
పూజ చేయ రండి గురు పూజ చేయ రండి
గురువారం గురువారం గురుపూజ చేయరండి ||
మాయ సంసారమును మాపు గురు పూజకు
చిత్తములో చిన్మయ రూపుని దర్శించుటకు ||
చావు పుట్టుకలు మాపి సచ్చిదానంద మిచ్చి
సదాచార సంపన్నుని చేయు సద్గురు పూజకు||
అజ్ఞానపు చీకటికి జ్ఞానోదయ భానుడై
ఆత్మ బోధ అతిసులువుగ చెప్పు సద్గురు దేవుని ||
గురుదేవుని మించిన దేవుడు లే డిలన లేడని
భుక్తి ముక్తి ఇహము పరము గురువే సర్వస్వ మనీ.
రచన & గానం
వై. నాగరంగయ్య తాడిపత్రి
Comments
Post a Comment