కంద, తేట,ఆట, సీస,పద్య విధానము

*💁🏻‍♂️ తెలుగు వ్యాకరణము*
〰〰〰〰〰〰〰〰
*10th వ్యాకరణం-ఛందస్సు - 5* 
〰〰〰〰〰〰〰
*కందం*
*తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కనిపించింది. ఈ పద్యపు లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులో గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుకుంటుంది. సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే.*

క.   కందము త్రిశర గణంబుల, 
      నందము గా భ జ స నలము లటవడి మూటన్     
      బొందును నలజల నాఱిట, 
      నొందుఁ దుద గురువు జగణ ముండదు బేసిన్

*లక్షణములు*

*పాదాలు నాలుగు*
*👉కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. గగ, భ, జ, స, నల ఇవి ఆ గణాలు*
*👉1,3 పాదాలలో గణాల సంఖ్య 3*
*👉2,4 పాదాలలో గణాల సంఖ్య 5*
*👉1,3 పాదాలలో 1,3 గణాలు జ గణం కారాదు.*
*👉2,4 పాదాలలో 2,4 గణాలు జ గణం కారాదు.*
*👉2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) జ కాని, నల కానీ అయి ఉండాలి.*
*👉2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం గగ లేదా స అయి ఉండాలి.*
*👉పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి.* 
*👉గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి.*
*👉2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి.*
*👉ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు.*

*గణముల వివరణ*
గగ గణము = UU { గురువు, గురువు }
భ గణము = UII { గురువు, లఘువు, లఘువు }
జ గణము = IUI {లఘువు,గురువు, లఘువు }
స గణము = IIU {లఘువు, లఘువు, గురువు}
నల గణము = IIII {లఘువు, లఘువు, లఘువు, లఘువు }

*ద్విపద*
ద్విపద: *రెండు పాదములు గల పద్యము*

*లక్షణములు*

*ద్విపద తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.* 
*ఈ పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి.*
*అందుకే దీనిని ద్విపద అంటారు.*
*ప్రతిపాదములోనీ మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణము ఉంటుంది.*
*మూడవ గణం యొక్క మొదటి అక్షరం.*
*ప్రాస ఉన్న ద్విపదను సామాన్య ద్విపద, ప్రాస లేని ద్విపదను మంజరీ ద్విపద అని అంటారు.*

*తేటగీతి*

*తేటగీతి తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.*
*తేటగీతి ఉపజాతికి చెందినది.*
*తేటగీతి పద్యం సూర్య, ఇంద్రగణాలతో ఏర్పడుతుంది.* 
ఒకరి| వర్షాస| నము ముంచ| కున్నఁ | జాలుఁ
III / UUI / IIUI / UI / UI
 న   / త   / సల   / హ   / హ
సూర్య  / ఇంద్ర   / ఇంద్ర    / సూర్య   / సూర్య
*పద్య లక్షణాలు:*
తేటగీతిలో నాలుగు పాదాలుంటాయి.
ప్రతిపాదంలో వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్ర గణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి.
ఒకటోవ గణం మొదటి అక్షరానికి నాలుగో గణంలో మొదటి అక్షరం యతి మైత్రి.
ప్రాసయతి ఉన్న పద్యాన్ని అంతరాక్కరగా పిలుస్తారు.కాని అన్ని అంతరాక్కరలు తేటగీతులు కావు.
ప్రాస నియమం లేదు.

*ఆటవెలది*
ఆటవెలది తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.
ఆటవెలది ఉపజాతికి చెందినది.
"ఇనగణత్రయంబు-నింద్రద్వయంబును, హంసపంచకంబు- నాటవెలఁది" -అప్పకవీయము.
అ) బ్రతుక / వచ్చుఁ / గాక / బహుబంధ / నములైన 
    న   /  హ    /  హ    /  సల   /    సల
 
ఆ) వచ్చుఁ / గాక / లేమి / వచ్చుఁ /  గాఁ క
UI / UI / UI / UI / UI 
   హ      హ      హ     హ       హ 
 
ఇ) జీవ / ధనము / లైనఁ / జెడుగాక / పడుఁగాక
 UI / III /  UI /  IIUI / IIUI
    హ    /  న    /  హ     /   సల    /    సల 

ఈ) మాట / దిరుగ / లేరు / మాన / ధనులు
 UI /  III / UI / UI / III
  హ    /  న   /   హ    / హ     /   న  

పై పద్యంలో 4 పాదాలున్నాయి.
ప్రతి పాదానికి ఐదు గణాలు ఉన్నాయి.
1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉన్నాయి.
2, 4 పాదాల్లో ఐదు సూర్యగణాలు ఉన్నాయి.
ప్రతి పాదంలో 4వ గణంలో మొదటి అక్షరం యతి చెల్లింది.
ప్రాస నిమయం లేదు.
ప్రాసయతి చెల్లును.
★ ఇట్లాంటి లక్షణాలున్న పద్యాన్ని 'ఆటవెలది' పద్యం అని అంటారు.
'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఆటవెలదులే.

*సీసపద్యం*
కాకతీ / యులకంచు / గంట మ్రో / గిననాడు 
UIU /  IIUI / UIU / IIUI
 ర   /  సల     /   ర     /  సల
ఇంద్ర    /   ఇంద్ర    /     ఇంద్ర    /   ఇంద్ర

కరకు రా / జులకు త / త్తరలు /  పుట్టె
IIIU  /  IIIU  /  III  /  UI
 నగ    /  నగ    /  న   /  హ
 ఇంద్ర / ఇంద్ర / సూర్య / సూర్య

కాపయ్య | నాయకుఁ | డేఫుసూ | పిననాడు
UUI / UIU / UIU / IIUI
   త    /    ర     /    ర     /   సల

పరరాజు / లకు గుండె / పట్టు / కొనియె
IIUI /  IIUI /  UI / III
 సల    /   సల    /    హ   /   న

*సీసపద్య లక్షణం :*

◆ *ఇందులో నాలుగు పాదాలుంటాయి.*
◆ *ప్రతిపాదంలో ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.*
◆ *పద్యపాదం రెండు సమభాగాలుగా ఉంటుంది.*
◆ *రెండు భాగాల్లోను మూడో గణంలోని మొదటి అక్షరం యతి లేదా ప్రాస యతి.*
◆ *1వ గణంలో మొదటి అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరంతో, 5వ గణంలో మొదటి అక్షరానికి 7వ గణంలో మొదటి అక్షరంతో మైత్రి కుదరాలి.*
◆ *ప్రాస నియమం లేదు. ప్రాసయతి ఉండ వచ్చు. అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు రెండో జత అక్షరాలు ప్రాసలో ఉండవచ్చు. ఒకే అక్షరం అయి ఉండాలి* (ఏ గుణింతమైనా సరే) 
◆ *తేటగీతి లేదా ఆటవెలది దీనికి చివరగా ఉంటుంది.*

*సీస పద్యాన్ని ఒకేలాగా ఉంటే నాలుగు పెద్ద పాదాలుగా కానీ (1,1,1,1),* 
*ఈ ఒక్కో పెద్ద పాదాన్ని రెండు చిన్న పాదాలుగా (1,2,1,2,1,2,1,2) మొత్తం ఎనిమిది పాదాలుగా వివరించవచ్చు.* 
*సీస పద్యంలో భాగం కాకపోయినా, సీస పద్యం తరువాత ఒక గీత పద్యం ("ఆటవెలది"లేదా "తేటగీతి") వస్తుంది.*
పై పద్యపాదాల్లో -
◆ *ఒక్కొక్కటి రెండు భాగాలుగా ఉన్నాయి.*
◆ *రెండు భాగాల్లో కలిపి ఎనిమిది గణాలున్నాయి. (ఆరు ఇంద్రగణాలు + రెండు సూర్యగణాలు)*
◆ *యతి, ప్రాస యతులు (కా-గ, ర-ర) (ప-పు; ప-ప) ఉన్నాయి.*
*◆ ప్రాసనియమం లేదు. వీటిని బట్టి ఇది సీసపద్యం అని గుర్తించవచ్చు.*

*ఈ అచ్చ తెనుగు పద్యరీతులలో కచ్చితమైన గణాలు చెప్పకపోవటం వల్ల అన్ని పద్యాలు (అంటే ఒక పద్యంలోని అన్ని పాదాలు) ఒకే లయలో ఉండనవసరం లేదు. కానీ వీటి లయను గుర్తించడం అంత కష్టం కాదు. పద్యాలు పైకి చదువుతుంటే లయ దానంతటదే అవగతం అవుతుంది.*

Comments