గజాననా జయ గజననా
గజానన జయ గజానన
గజముఖ వదన గజానన
గౌరి సుపుత్రా గజానన
గాణవినోద గజానన || 1
విమలచరిత్రా గజానన
విద్యాదాయక గజానన
మూషిక వాహన గజానన
ముక్తి ప్రధాయక గజానన || 2
భక్త సన్నుతా గజానన
బంధ విమోచన గజానన
మునిగణ సేవిత గజానన
మురారి పూజిత గజానన || 3
షణ్ముఖ సోదర గజానన
సచ్చిదానంద గజానన
గంగాధర సుత గజానన
గరిక పూజ ప్రియ గజానన || 4
రచన & గానం
వై. నాగరంగయ్య తాడిపత్రి
Comments
Post a Comment