ఉత్పలమాల ఛంద స్సు

*💁🏻‍♂️ తెలుగు వ్యాకరణము*
〰〰〰〰〰〰〰〰
*10th వ్యాకరణం-ఛందస్సు - 4* 
〰〰〰〰〰〰〰〰
*ఉత్పలమాల*
భండన|భీముఁ డా|ర్తజన| బాంధవుఁ| దుజ్జ్వల| బాణతూ|ణ కో
UII / UIU / III  / UII   / UII  /  UIU  /  IU
భ        /  ర     /   న     /   భ      /     భ     /    ర  /    వ
*లక్షణాలు:*
1. పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
2. ప్రతి పాదం భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలను కలిగిఉంటుంది.
3. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి.
4. యతిస్థానం 10వ అక్షరం.
5. ప్రాస నియమం ఉంటుంది.

*చంపక మాల*
అనయ|ము దోష|మే పరు|లయందు|కనుంగొ|ని పల్కు|నట్టి యా
III / IUI /  UII  / IUI  / IUI / IUI  / UIU
న      /    జ     /   భ     /   జ       /   జ    /    జ     /    ర
*లక్షణాలు:*
1. పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
2. ప్రతి పాదం న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలను కలిగిఉంటుంది.
3. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి.
4. యతిస్థానం 11వ అక్షరం.
5. ప్రాస నియమం ఉంటుంది.

*శార్దూలం*
కారే రా|జులు? రా|జ్యముల్ గ|లుగవే?| గర్వోన్న|తిం బొంద|రే?
UUU  /  IIU  / IUI / IIU  / UUI / UUI / U
మ     /   స       /     జ      /    స      /    త     /    త  /    గ
*లక్షణాలు:*
1. పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
2. ప్రతి పాదం న, జ, భ, జ, జ, జ, ర అనే గణాలను కలిగిఉంటుంది.
3. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి.
4. యతిస్థానం 13వ అక్షరం.
5. ప్రాస నియమం ఉంటుంది.

*మత్తేభము*
తెలగా|ణమ్మున| గడ్డిపో|చయును| సంధించెన్| కృపాణ|మ్ము! రా 
IIU  / UII   /  UIU   /  III   /   UUU   /   IUU   /  IU
 స    /    భ    /    ర     /    న    /     మ   /       య  /     వ
*లక్షణాలు:* 
1. పద్యంలో నాలుగు పాదాలుంటాయి.
2. ప్రతి పాదం స, భ, ర, న, మ, య, వ అనే గణాలను కలిగిఉంటుంది.
3. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి.
4. యతిస్థానం 14వ అక్షరం
5. ప్రాస నియమం ఉంటుంది.

*పై నాలుగు పద్యాల లక్షణాలు*
పద్యము -- పాదాలు -- గణములు -- యతిస్థానం -- అక్షరాలు -- ప్రాసనియమం -- ప్రాసయతి
1. *ఉత్పలమాల* -- 4 -- భ ర న భ భ ర వ -- 20 -- 10 -- ఉంటుంది -- లేదు
2. *చంపకమాల* -- 4 -- న జ భ జ జ జ ర -- 21 -- 11 -- ఉంటుంది -- లేదు
3. *శార్థూలము* -- 4 -- మ స జ స త త గ -- 19 -- 13 -- ఉంటుంది -- లేదు
4. *మత్తేభము* -- 4 -- స భ ర న మ య వ -- 20 -- 14 -- ఉంటుంది -- లేదు

ఉ - భ - 20 - 10
చ - న - 21 - 11
శా - మ - 19 - 13
మ - స - 20 - 14

*పై నాలుగు పద్యాలలో అన్నింటిలోనూ నాలుగు పాదాలుంటాయి.* 
*అలాగే ప్రాస నియమం ఉంటుంది. ప్రాస యతి వుండదు.*

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం