పల్లెకు పండగ వచ్చింది
ఓం
పల్లెకు పండగ వచ్చింది మా
పల్లెకు పండగ వచ్చింది
వానాకాలం వచ్చింది మా
పల్లెకు పండగ వచ్చింది ||
చెరువు కుంటలు నిండాయి
వాగు వంకలు పోర్లాయి
భూములన్ని తడిసి పోయాయి
మా ముంగిట పైరులు మొలిచాయి ||
దొండ కాయ మెక్క లేస్తాము
బీరకాయ విత్తు బెడతాము
పచ్చి మేరపను పండిస్తాము
ఆకు కూరలకు అంతే లేదు l l
ఉల్లిగడ్డ బంగాళ దుంపలు
బెండకాయ తమేట పండ్లు
మునగ కాయ గుత్తోంకాయ
క్యాబేజీ క్యారెట్ కాళీ ప్లవర్ l l
జామ పళ్ళు సపోటా పళ్ళు
కమలా పళ్ళు కరుబుచ్చ పళ్ళు
ద్రాక్షపండ్లు దానిమ్మ పళ్ళు
అన్ని టికీ మా పల్లె పంటలే l l
పూలతోటలతొ పుట్టింది పల్లె
వరి పైరులతో మురిసింది పల్లె
పాడిపసువులకు పట్టు కొమ్మ యై
ప్రజల కెళ్ళ బువ్వ బెట్టింది పల్లె l l
రచన & గానం
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240
Comments
Post a Comment