ఎన్ని గుళ్ళు దిరిగినా ఏమిలేదురా

ఎన్ని గుళ్ళు దిరిగినా ఏమిలేదురా
చింతలన్ని మానేసి చూడు లోన గురుని రా ||

ముక్కు కొనను ఎక్కు బెట్టి నిక్కి చూడరా
ఆ ముక్కు మహిమ ఏమొగాని దివ్య మాయరా||

ముసుగు వేసు కొన్న మాయ సొగసు చూడరా సొగసు లోనే దాగి ఉన్న మోక్ష కాంత జూడరా ||

అన్ని చోట్ల కలదిరిగెడి  గాలియె నీ ఊపిరి రా
ఆ గాలి పీల్చు మూలమును బట్టి చేధించరా ||

ఈడ పింగళా మధ్య నున్నదాని చూడరా
నీటి కుండలోదాగిన నిక్షేపము గాంచరా ||

భూమి, జల, అగ్ని, వాయు, వాకాశములకు
మూల పరబ్రహ్మ మైన ముక్కంటిని వేడరా ||

సత్తి చిత్తు నొకటి జేసి సదా బ్రహ్మమందు నిలిచి
సచ్చిదానంద గురుని సాగిలబడి మ్రొక్కుమురా ||

రచన & గానం 
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం