రామడన్న రంగడన్న బాల గేయం

బాలల గేయం

రామన్న రంగడన్న
రండి రండి ఆటలాడ
వీధిలో పిల్లలంతా
గుమ్ముగూడి నొకచోట l l

కళ్ళామూసి లాట
కనిపెట్ట జూడంగా
చిల్లా కర్ర లాట
చిల చేత బట్టంగ l
తాడాట ఆడంగ
టక టక రారండి
బాలాట ఆడంగ
బరుగూన రారండి l l

బొంగరాల ఆటలాడ
గోలి గుల్ల ఆటలాడ
కయ్యలాట లాడంగ 
పరుగు లాట లాడంగ l 
గానాట లాడ రండి
ఫుట్బాలు ఆడ రండి
కిరికెట్టు ఆడ రండి
దొంగాట లాడ రండి l l 

గుడు గూడు ఆడంగ
గుడివాడ రారండి
ఎగురాట ఆడంగ
ఏరువాక రారండి l
చెమ్మ చెక్క లాడంగ
చెన్నూరు రారండి
బ్యాటాట ఆడంగ
భానుకోట రారండి l l

అమ్మా నాన్నలకు
ఆటలాడ చెప్పి రండి
ఇరుగ పొరుగు వాళ్ల
కిబ్బంది బెట్ట కండి l
చూసే వాళ్లకేమో
చూడముచ్చ టాడండి
దుమ్ము ధూళి మీద
పడకుండ ఆడండి l l


రచన.
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి

Comments