ఎంత మంచి గురుడు దొరికేలే
రాయలసీమ తత్వజ్ఞాన గేయం
----------------------------------------
ఎంత మంచి గురుడు దొరికెలే
సజ్జనులారా
ఎంత మంచి గురుడు దోరికెలే
ఎంత మంచి గురుడు దొరికే
అంతరంగ మందు నున్న
చింత లేక గురుని పాదము
చెంత జేరి యుండు మనెను||
కనులు వీనులు మూసియుంచి
గాలి రాక పొక దెలసి
పున్నమా వెన్నేల బయట
కన్ను దేరచి చూడు మనెను ||
పంచ కోశామూలు బాపి
పంచ వింశతి తత్వమావల
వంచనమ్మా వంత ఎరుగని
బట్ట బయలును జేరు మనెను ||
ఎరుక మరపులు విప్పి జెప్పెను
ఎన్ని జన్మలొ గాల్చి వేసెను
దరణిలో శివ పోతులూరయ
దైవరాయుం డొక్కడనెను ||
Comments
Post a Comment