పాట నీవున్నావని చెబితే
ఓం
నీవున్నావని చెబితే నీ కొండకు వస్తున్నాము
నీ దర్శన భాగ్యము కలిగించవయా స్వామి గోవిందా స్వామీ వెంకటేశ ll
కాలినడకన మెల్లగ కదులుచు
మెట్టు మెట్టుకు బొట్టును బెట్టుచు
గోవిందా గోవిందా నామములు
చెప్పుచు కొండను ఎక్కుచు
ఆపై నీ దివ్యధామమును చేరేము ll
పుష్కరిలోన స్నానము జేసి
ముందుగ వరాహ మూర్తిని గాంచి
ఆ పక్కనె ఉన్న వెంగ మాంభ
బృందావన మును జూసి
ఆపై నీ భక్త వరుసన నిలబడత ||
వై. నాగరంగయ్య
Comments
Post a Comment