మనసా మనసా నీవేవరే

ఓం
రాయల సీమ తత్వ జ్ఞాన గేయం
-------------------------------------------

అంశం 
మనసు జీవుడు-- ప్రశ్న -- జవాబు

మనసా మనసా నీవెవరే
      నాలోని కెందుకు వచ్చావే 
సంచిత కర్మలె వాసనలై
       మనసు రూపమై వచ్చా నేను ll

నువ్వే ట్ల పోతావే మనసా
     దారి జెప్పవే నాకు మనసా
సంచిత కర్మలు తొలగ జేసిన
      నేనెల్లి పోతాను నీ నుండి ll

వస్తె వస్తివి నువ్వు కానీలే
    నాతొ ఎందుకాడు కుంటావే
పంచాక్షరీ మంత్ర మను చుంటే
     పడుకొని నిదురోత  నందులో  ll

ఆశలురేపుదు వెందుకె నాలో
    అంతము జేసెద వేల దానితో 
 ఆరుదళంబుల   అష్టాక్షరీని 
    అఖండ జపము జేసిన జాలు ll 

నైమిష మైన నొక చోట నుండవే 
      ఆ మర్మమేమో నాకు జెప్పవే
ఉచ్వాస నిచ్వాసముల నాపి
      మూల విరాటును సూడు సూటిగా ll

రచన
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం