మగ్గం బట్టి నేయుచూ కూడా

ఓం
మగ్గం బట్టి నేయుచు కూడా
   మోక్షం పొందర ఓ నరుడా
భర్గో దేవస్యా యని మగం
     నేయుచు నుండుర ఓ నరుడా.

గణపతి మంత్రం నెప్పుడు చెప్పుచు
   గకార శబ్ధం చేయుచు నేయరా 
కామక్రోదముల రెంటిని విడిచి
     కబీరుదాసుల నేయర నరుడా ll 
     
వాటు వాటుకు రామ రామ యని 
      వసుధ వైకుంఠ వాసుని నమ్మి
సత్య ధర్మముల రథము నెక్కి
      సారథి చేయుచు నేయర నరుడా ll

అసూయ అంచుకు రానీ కెపుడు 
     అత్మారామునిడువకు మదిలో
మగ్గము చేసెడి శబ్ధములోన
     ప్రణవ నాదం పలుకుచు నేయర ll

రచన
యలిగండ్ల నాగరంగయ్య 
తాడిపత్రి

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి