నరుడా నరుడా తత్వం
ఓం
రాయలసీమ తత్వజ్ఞాన గేయం
-------------------------------------------
నరుడా నరుడా నరుడా
నా మాట నమ్మురా నరుడా ll
ధనము ధనమనుచు ధనము కోసము నీవు
ఏల దిరిగెదవయ్య నరుడా
ధనమున్న నాల్లే నీవెంట నీవారు
పిదప ఎవ్వరు రారు నరుడా ll
ఎన్నెన్నో జన్మలు యెత్తి యెత్తి నీవు
ఈ జన్మ మెత్తితివి నరుడా
అన్ని జన్మల లోన ఆకలీ దప్పికలె
అవిలేని మొక్షంబు పొందు నరుడా ll
సద్గురుని చరణాలె సర్వజ్ఞమని యెంచి
సంతతము పూజించు నరుడా
అజ్ఞాన చీకటికి అతడే దీపమని
అమితంబుగా నమ్ము నరుడా ll
మూడారు వాకిడ్లు మూత లేసీ నీవు
ముక్తి దామము జూడు నరుడా
కనుల భ్రూమధ్యమున కదలనీక మనసు
సూటి దప్పక జ్యోతి చూడు నరుడా ll
ఇల్లు కావాలంటూ ఇల్లాలు నాదనుచు
బ్రమలోన జిక్కితివి నరుడా
సంచిత కర్మములు సమయంబు కోసమై
కాపు కాచీ నిన్ను కడతెర్చు నరుడా ll
రచన & గానం
వై. నాగరంగయ్య
Comments
Post a Comment