రామ భజన సేయరా
ఓం
రామభజన సేయరా లమిడికా లమిడికా
నీ తాపస మణచరా ధగిడికా ధగిడికా ll
ధూము ధాము లేమిజేసి
నోము కన్నా ఫలమె కాని
తాము తాము తరలిపోయ్యే
దారి యైతే తెలుసుకోరా ll
కండక్రొవ్వు చేత నిట్టు
తిండిపోతులగూడి
యుండక నువు తిరగబోతే
గండమేల తప్పునయ్య ll
తల్లి పిల్ల యిల్లు వాకి
.లెళ్ళ గాని దొరలు బోసి
యముడు చాల కర్ల గొట్టి
పొరల నిన్ను జేయునా ll
టక్కు టిక్కు లాడుపిచ్చి
కుక్కరీతి మొరగొద్దూ
జక్కలేటి కంబగిరిని
చక్కనయ్య నట్లె మ్రొక్కు ll
Comments
Post a Comment