గయోపాఖ్యానం అల్లుడా రమ్మని పద్యం

గయోపాఖ్యానం శ్రీకృష్ణార్జునుల
           యుద్ధాంఖం 

యుద్ద సమయంలో ఇద్దరు ఒకరి నొకరు ఎత్తి
పొడుచు మాటల సందర్భమున అర్జునుడు
ఇలా శ్రీకృష్ణుని ఎత్తిపొడుచు మాటలతో అర్జునుడు
చెప్పుచున్న పద్యం.

సీ ll 
అల్లుడా రమ్మని ఆదరమ్మున బిల్వ
       బంపు మామను బట్టి చంపగలమె
జలకేళి సవరించు జవరాండ్ర కోకల
        నెత్తుకపోయి చెట్లెక్కగలమె
ఇల్లిల్లు దిరిగి వ్రేపల్లెలో మ్రుచ్చిలి
       మిసిమి ముద్దలు తెచ్చి మ్రింగగలమె
గొల్లబొట్టెల గూడి కోలచేకొని యాల
          కదుపల నేర్పుతో కాయగలమె

తే గీ.
తల్లిదండ్రుల పరులకీ దలచు కన్య
బలిమిమై దెచ్చి భార్యగా బడయగలమె
దుష్టులను వంక వీరుల ద్రుంపగలమె
అనపరాధుల దండింప నరుగ గలమె. ll

సేకరణ. యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం