బాల సాహిత్యం
బాల సాహిత్యం
బలే బలే బాలలం
బంగారు భవితలం
చిట్టి పొట్టి కూనలం
చిరునవ్వుల పువ్వులం l l
ఆటలాడు బాలలం
అమ్మ చాటు పిల్లలం
కపటమేమి లేనోల్లం
కాలానికి వెలుగులం ll
బడికెల్లే బాలాలం
బాగుపడే ధీరులం
దేశానికి పౌరులం
దేనికినీ భయపడం ll
బేదమేమి లేనోళ్ళం
దేవునికి వారసులం
కపట మెరుగ నోళ్ళం
కలకళా వెలుగు తాం ll
రచన
వై.నాగరంగయ్య
తాడిపత్రి
Comments
Post a Comment