ఉగాది పండుగ

ఓం
ఉగాది .... యుగాది ... ఊరూర ఉగాది 
వాడ వాడలా యుగాది ఏడాదికి నొకసారి
వచ్చును వసంత కోకిల యుగాది ll 

సృష్టి  ఆది మూలం యుగాది 
సుందర వసంత ఋతువారంభం
యుగ యుగాలుగా యుగాది
తరతరాల మన సంస్కృతి యుగాది ll 

కొత్త పంచాంగమున తోన
రాశిఫలాలను వెంట దెచ్చి 
లాభ నష్టములు అందరి కిచ్చి
రాజ్య మేలెను గ్రహములతోన l l

చెంగు చెంగు  చెంగావి రంగుతో 
చైత్ర మాసమును తీసుకు వచ్చి
వలపు గాలుల వసంతములతో
పచ్చని వెచ్చని ప్రకృతి ఈ ఉగాది ll

ఘుమ ఘుమ లాడే భక్ష వంటల
భందు జనులతో విందు వినోదం
ఆడ బిడ్డల అల్లుళ్ల తోనా
ఊరంత ఇల్లంతా సందడే సందడి l l

రచన & గానం
వై. నాగరంగయ్య తాడిపత్రి

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం