ఉగాది
ఓం
వచ్చింది వచ్చింది ఉగాది పండుగ
తెచ్చింది తెచ్చింది వసంత వేడుక ll
కొత్త సంవత్సరము
వెంట బెట్టు కొచ్చింది
రాశిఫలాలు కూడ
రమ్యంగ దెచ్చింది ll
తీపి వగరు పులుపు
ఉప్పు కారం చేదు
షడ్రుచుల సన్మిలిత
పండ గొచ్చి చేరింది ll
కొత్త బట్ట లేసుకొని
చుట్టాల బిల్చుకొని
పిన్నా పెద్ద లంత కలిసి
పారాట లాడు కొంటు ll
మామిడాకు తోరణాల
మల్లె పూల పరిమళాలు
ఇల్లూ వాకిల్ల బొట్ట్లు
వీధి వీధి సంబరాలు ll
పెద్దమ్మ దుర్గమ్మ
అంకాలమ్మ సుంకులమ్మ
అమ్మ వారి గుల్లల్లో
బోనాలపూజ లంట ll
గన్నలూరు గంగమ్మ
చామలూరు చౌడమ్మ
బద్రమ్మ లందరికీ
బలిపూజ లర్పించ ll
రచన & గానం
వై. నాగరంగయ్య తాడిపత్రి
Comments
Post a Comment