హరిహర
హరి హర గేయం
శివ నారాయణ పూజల కిష్టమైన మాసం
కార్తీక మాసం పరమ పుణ్య మాసం l l
తొలి ప్రాతఃస్నానం మలి సంధ్య స్నానం
పావన మొనరించి పరమునిచ్చు స్నానం l l
శివ లింగ అభిషేకం శ్రీశైల దర్శనం
గరలకంఠ గానం గాచి కైవల్య మిచ్చు l l
విష్ణు మూర్తి కెంతో ఇష్ట మైన మాసం నారాయణార్చనల నరుల ముక్తి మానం l l
కార్తీక దీపం కలుగు వెలుగు జీవితం
సాగర స్నానం సమసిపోవు సంచితం l l
రచన & గానం
యలిగండ్ల నాగరంగయ్య
9866068240
Comments
Post a Comment