చిన్న గుళ్ళు పెద్ద గుడులు తేడా

ఓం
పెద్ద ఆలయాలకు పోవటం మేలా
చిన్న గుళ్ళకు పోవటం మేలా

పెద్ద పెద్ద ఆలయాలకు వెళితే దర్శన సమయం
కాస్త ఎక్కువ పడుతుంది పైగా అక్కడ పూజా 
కార్యక్రమంలో భాగంగా దేవుడి దగ్గర మనము
తీసుకెళ్లిన కొబ్బరి కాయ కొట్టి ఆ కొబ్బరి కాయ ముక్కలు పల్లు దేవునికి నివేదించడం వంటి ప్రక్రియ దాదాపు ఉండదు
కారణం అక్కడున్న రద్దీ కారణంగా దేవాలయ
పాలనా వ్యవస్థ బయట కొబ్బరికాయలు కొట్టు
స్థలము అని ఒక బోర్డ్ పెట్టీ అక్కడ భక్తులు 
ఎంతో భక్తితో తీసుకెళ్లిన కొబ్బరి కాయను కొట్టి
దేవుడికి నివేదించ కుండానే మనకు ఒక ముక్క
ప్రసాదంగా ఇస్తారు ఇది పెద్ద గుళ్ళలో జరుగు చున్న పరిస్థితి.

ఇక చిన్న గుళ్ళకు వెళితే దర్శనం తొందరగా
అవుతుంది పైగా మనము తీసు కెల్లిన 
కొబ్బరి కాయ అక్కడే దేవుడి ముందరే కొట్టి
రెండు వప్పులు పల్లు దేవుడికి నివేదన చేసి
అర్చన చేసి ప్రసాదముగా మనకు కొబ్బరి
పల్లు పూలు మొదలగు వాటిని అర్చక స్వాములు
ఎంతో వినయంగా మనకు ఇచ్చు చుందురు
మనకు కూడా అక్కడున్న సమయమంతా చాలా ప్రశాంతముగా ఉండును ఇది చిన్న గుళ్ళకు
పెద్ద పెద్ద గుళ్ళకు ఉన్న తేడా గమనించండి 
భగవద్ భక్తులార.

వై. నాగరంగయ్య తాడిపత్రి

Comments

Popular posts from this blog

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం

వివేకానంద జయంతి