వరలక్ష్మి
వరలక్ష్మి గేయం
వరలక్ష్మి వరలక్ష్మి వందనం వందనం
వసుధ గన్నా తల్లి వందనములు నీకు
వందనములు
శ్రావణ మాసమున
శుక్రవారము నాడు
పుణ్య స్త్రీ లందరు
వ్రతము తో నీపూజ
జేయ జూడగ రమ్ము
శ్రీ వర మహాలక్ష్మి.
వరలక్ష్మి రావమ్మా
వచ్చి పూజలు గొనిమ
సకల శుభముల నిచ్చి
చల్లగా మము చూడవమ్మా
దురితములు బాపమ్మ
దయవర్ష మును ముంచ వమ్మా.
స్వాగతం స్వాగతం సుస్వాగతం
శ్రావణ మాస శుక్రవార ప్రియే l l
Comments
Post a Comment