మహాలయ అమావాస్య

ఓం
మహాలయ అమావాస్య పితృ పూజ యొక్క
ఫలితం, మరియు పితృదోష దుష్ప్రభావములు

పితృ పూజలో పితరులకు శ్రాద్ధము శ్రద్ధతో భక్తి
ప్రపత్తులతో పితరులు స్వీకరించు విధమున పిండం పెట్టాలి దాని చేత పితరులు
సంతోషమును చెంది తమ వంశీ కులమైన
మనకు శరీర వ్యాధులు రాకుండా 
వంశం అభివృద్ధి జరిగి కలిగిన సంతానం చదువు సంస్కరములతో పాటు ఉత్తమ పౌరులుగా జీవించ బడతారు అని దీవెన చేయుదురు అది దేవతల
దీవెనల కన్నా పెక్కు రెట్లు ఎక్కువగా పని చేయును అని స్కాంద పురాణం చెబుతుంది.

పితృ దోషం అంటారు ఇది ఉన్నవాళ్లు
పూర్వ జన్మలో తమ పితరులకు అన్నం పెట్టక
ధనము కోసమో ఆస్తుల కోసమో తల్లి దండ్రులను వారి పితరు లైన తాత ముత్తాతలను కానీ అనేక విధముల బాధించినచో వచ్చు దోషమును పితృ
దోషము అంటారు ఈ దోషం వల్ల పుత్ర సంతానం
లేక పోవటం ఒక వేళ ఉన్న వారు మంచి బుద్ది
కలగక పోగా చెడు బుద్ధితో ప్రవర్తించి తండ్రికి
తల్లికి నాన నరకం చూపించు వాడై ఉండును
లేదా వాడు మానసికంగా పిచ్చి వాడుగా కూడా
పుట్టును.మరియు పితృ దోషం వలన తాను 
గృహ నిర్మాణము జీవి తాంతము వరకు చేపట్ట లేక ఇల్లు లేని వాడిగా ఉండిపోవటం జరుగును తాను తల పెట్టిన వివాహ కార్యములు 
దగ్గరగా వచ్చి నట్లు వచ్చి చివరి దశలో ఆగి పోవుట లేదా తమ పిల్లలకు వివాహం జరిగినా
అందులో భార్య భర్తల మధ్య వారికి అనేక గొడవలు జరిగి చివరికి వైధవ్యం లేక విడాకులు మొదలగు అనేక అనర్థాలు జరుగును పితృ దోషం వల్ల కావున పితృ రుణం ప్రతి వారు కూడా 
తీర్చుకో వలసిందే మహాలయ అమావాస్య చేసుకో వలసిందే పితరులకు  పిండాలు పెట్ట వలసిందే గయా కాశీ ప్రయాగ మొదలగు పుణ్య క్షేత్రాలలో పిండాలు పెట్టట వలన విశేష మైన ఫలితం ఉండును అని శాస్త్ర వచనం.

యెలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం