సీ ll యువత సామాజిక సేవా తత్పరత
ఓం
యువత సామాజిక సేవా తత్పరత
పెంపొందించు కొను విధానము
---------------------------------------------
సీ l l
కడుబీద వారల కన్నంబిడిన జాలు
నన్న సత్రము లెన్నొ నడిపి నట్లు
తన్ను నేరంబులు తా దెలిసిన జాలు
పరుల బుద్దియు బాగు బరిచి నట్లు
శిష్ట జనాళికి సేవ చేసిన జాలు
వెలయ తీర్థములు సే వించి నట్లు
చెడ్డ పనులు తాను చేయ మానిన జాలు
ఘణ సద్గుణంబులు గల్గి నట్లు
తే l l
పొందుగా మానసము నిట్టి బుద్ది యున్న
కోటి దైవంబు లను తాను కొలచి నట్లు
అట్టి యువతకు యీ జన్మ మందు కీర్తి
బావి తరముల వారికి బాట జూపు .l l
రచన
వై.నాగరంగయ్య
3/47 రెడ్డివారి వీధి తాడిపత్రి
అనంతపురం జిల్లా ap 515411
చరవాని 9866068240
Comments
Post a Comment