సీll యువత సామాజిక సేవా తత్పరత

అంశం
యువత సామాజిక సేవ తత్పరత
పెంపొందించు కొను విధానము
------------------------------------------

సీ l l
సంఘంబు మెచ్చినా సంతసించగ వద్దు
       విభవంబు నమ్మి గర్వింప వలదు
తల్లిదండ్రుల మీద దప్పు లెన్నగ వద్దు
       సత్బ్రాహ్మణుల తోన సరస మొలదు
అయిన వారి నడిగి నప్పు జేయగ వద్దు
        మంచి జేసిన వార్ని మరువ వలదు
ప్రాణి హింస కెపుడు బాల్బడగను వద్దు
       చెడు వారితో జెల్మి చేయ వలదు

తే l l
సజ్జనుల తోన హాస్యము సలుప వద్దు
వేయి శ్రమలున్న నీతిని విడువ వద్దు
నట్టి గుణములు విడువక నడచు చున్న
యువత కీర్తిని గొనియాడు యుగము వరకు ll

రచన
వై. నాగరంగయ్య
3/47రెడ్డివారి వీధి తాడిపత్రి
అనంతపురం జిల్లా ap---515411
చరవాని 9866068240

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం