అమ్మా దుర్గమ్మా

అమ్మా దుర్గమ్మా అమ్మా దుర్గమ్మా 
మా కభయ మీయ వేళ వమ్మా

కడుపాపి ననుచు నను కరుణించ కున్నావా
కడుపాపి నైనా నీ కడకు వచ్చితి కదమ్మా

మొక్కు కొన్నా వారి మ్రొక్కూలు దీర్చేటి
మొగిలి రేకుల వంటి కన్నులున్నా కనకదుర్గ  l l

దుష్టుల దునుమాడి శిష్ట రక్షణ జేసీ
బెజవాడ కొండన వెలసిన  వో యమ్మా l l

కన్న తల్లీ కన్న కల రెవ్వరూ మాకు
కఠిన మైన చూపు వదలి కరుణించవే l l

నగరాజ వర పుత్రి నటరాజ ప్రియ పత్ని
నాలుగు వేదాల నడుమ నుండే తల్లీ l l

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం