సి l l శ్రీ యనంత పురం
శీర్షిక,. రాయలసీమ రారాజు అనంత
సి l l
శ్రీ యనంతపురము సీమలో సిగచంద్ర
వివరంగ చెప్పెద విను చరిత్ర
లేపాక్షి బసవన్న లెస్సగా కూర్చున్న
రమ్య బసవ శిల్ప రాజ మయ్యె
ధగ ధగా మెరిసేటి ధర్మవరపు పట్టు
చీరల పెళ్లిళ్ల చిహ్న మయ్యె
వజ్రాల సంపద వజ్రకరూరు మా
భూమికి సరి సాటి భూమి గలదె
తే.
సకల దేశాల దైవము సత్యసాయి
వెలసి వెలిగిన ఆధ్యాత్మ వేదభూమి
అట్టి సంపదలున్న యీ ఆంధ్ర భూమి
అన్ని చెప్పగ నా నోట నలవి కాదు l l
ఆ.వె
సీమ మట్టిలోన సిరిసంపదలు ఎన్నో
పసిడి వజ్ర గనుల పంట భూమి
రామగిరిన పసిడి రంజిల్లు గనులలో
వజ్రకరురు సీమ వజ్ర నెలవు l l
ఆ. వె
యెర్ర నేల నిసుక యిలనల్ల రేగడి
పసిడి పంట నీటి పైపు లైన్లు
నాడు మెట్ట భూమి నేడు తోటలెలసీ
పళ్ళు కూరగాయ పండు సీమ l l
రచన
వై.నాగరంగయ్య
తాడిపత్రి 9866068240
Comments
Post a Comment