ఆ.వె అప్పు చేయ తప్పు
ఆ.వె
గొప్ప చెప్పు కొనుట కప్పుజేసి పనులు
చేయు చుందు రిలన చెక చకాన
అప్పు దెచ్చు ముప్పు ననుకోక మూర్ఖుడు
తప్పు చేయు చుండు ధరణి లోన l l
ఆ.వె
హద్దు మీరి నీవు అప్పు చేయుట ముప్పు
గొప్ప కొరకు నెపుడు నప్పు వలదు
అప్పు ఎప్పు డైన నిప్పులాంటి దనుచు
ఋణము చేయకుండు గుణము చేత l l
Comments
Post a Comment