శ్రీ శై ల శివస్తుతి

అంశం.  శ్రీశైల శివస్తుతి 

సీ l l 
మల్లన్న మహదేవ మామొర వినవేమి 
      పలుమార్లు శివయన్న పలుక వేల 
సంధ్య తాండవ కేళి సంభ్ర మందున నీవు 
      ననుజూడ కున్నావ నాగ భరణ 
గంగమ్మ శిరసున గళ గళ మనయంగ 
       వినజాల కున్నవా విన్నపాలు
భ్రమరాంబికా నాథ భక్త సన్నుత దేవ 
       భవము బాపుము తండ్రి భక్త వరద 

తే. గీ 
ఎంత వేడిన నీకును కొంత యైన 
జాలి రాదాయె మాపైన జంగ మయ్య 
ప్రమత గణనాథ మామీద పంథ మిడువు 
దేవ శ్రీ శైల వాస వో దేవ దేవ l l 

ఆ.వె 
మల్లి కార్జున హర మదనాంగ భంగనా 
మమ్ము కావ రావ మల్లి నాథ 
దీన జనుల పాల దినకర శశినేత్ర 
దిక్కునీవె మాకు దివ్య తేజ l l 

రచన 
వై.నాగరంగయ్య 
తాడిపత్రి అనంతపురం జిల్లా ap

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం