స్వాతంత్ర ఫలం సకల విప్లవకారుల ప్రతిఫలం
ఓం
స్వాతంత్ర సఫలం సకల విప్లవ కారుల
ప్రతి ఫలం
నాదేశ స్వాతంత్రం నానా విప్లవ ఉద్యమ
కారుల ప్రతిఫలం అని నేను భావిస్తాను
ఒక్క గాంధీ గారి చేతనే వచ్చిందని
నేను భావించను అందుకు కారణం
ఒక పెద్ద గుండురాతిని పగల గొట్టు నప్పుడు
వంద మంది సిద్ధపడి దాని మీద 99 మంది
తొంభై తొమ్మిది పెద్ద పెద్ద దెబ్బలు కొట్టగా
ఆంతర్యముగా బలహీన పడిన ఆగుండురాయి
చివర నూరవవాడు కొట్టిన దెబ్బకు గుండు పగిలినపుడు ప్రతిఫలం
అంతా చివరగా కొట్టిన వాడికే కట్ట బెట్టడం
న్యాయ సమ్మతం కానట్లు అనేకులు స్వాతంత్ర సమర పోరాట
విప్లవ వీరులై తెల్ల దొరలమీద
దండెత్తి దెబ్బలు కొట్టి కొట్టి వారిచేత బలహీన పడిన బ్రిటీష్ పాలకులు చివరన గాంధీ గారి దెబ్బకు అంత మయినది కాబట్టి ఆయనకే ప్రతిఫలం అంతా కట్ట బెట్టి గాంధీ గారు సాధించి
తెచ్చిన స్వాతంత్రం అని దేశం భావిస్తుంది
ఇది సమ్మత మేన ఆ లోచించండి.
స్వతంత్ర సమర పోరాటంలో గాంధీ గారి కృషి
శాంతి సమర పోరాటం చాలా చాలా విశేషమైన
ప్రయత్నమే అయినప్పటికీ అనేకులు ప్రాణాలు
పణంగా పెట్టిన వారు కూడా చాలా మంది
ఉన్నారు స్వాతంత్ర సమర పోరాట చరిత్రలో.
వారందర్నీ కూడా ఇప్పటికీ మనజాతి మొత్తం తలచుకుంటూనే ఉన్నాము వారి వారి జన్మ
దినాలు వర్ధంతులు జాతి జరుపుకుంటూ.
Comments
Post a Comment