ఆ.వె గాంధీ

ఆ.వె
గాంధి గారు కన్న కలలు యీ జాతికి
పూల బాట లాయె పుడమి నందు
కక్ష గట్ట వద్దు కర్ర బూనగ వద్దు
శాంతి తోన జయము సాధ్య మనెను

తెల్ల దొరలమీద తిరుగు బాటు జయము
తేట తెల్ల ముగను తెచ్చి నాడు
జాతి నంత నొక్క జాగృతి కల్పించి
బ్రతుకు బాని సతను బాపినాడు l l

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం