కుప్పించి ఎగచిని

కుప్పించి ఎగచిన
వ్యాఖ్యానం. యలిగండ్ల నాగరంగయ్య
              తాడిపత్రి

శీర్షిక.   భీష్మ ప్రతిజ్ఞ

మహాభారత యుద్ధములో ఆయుధం
చేత బట్టను అని శ్రీ కృష్ణ భగవానుడు
ప్రతిజ్ఞ చేశాడు అదేవిధముగ భీష్ముడు కూడా
ఏదేవ దేవుడు అతితే ఆయుధము పట్టను
అని ప్రతిజ్ఞ చేశాడో అట్టి కృష్ణ పరమాత్మ
చేతనే చక్రము చేత బట్టి యుద్ధమునకు
పూనుకొను నట్లు చేసెదను నేను అని భీష్ముడు
ప్రతిజ్ఞ చేసిన సందర్భము ననుసరించి పోతన
రాసిన యుద్ధ సన్నివేశం.

భీష్ముడు చేయుచున్న భీకర మైన
యుద్ధములో అర్జునుడు అలసిపోయి
భీష్ముడితో యుద్ధము చేయలేక పోతున్న
సందర్భమును గమనించిన శ్రీకృష్ణుడు
తటాలుమని గుర్రపు పగ్గాలు వదిలి రథము
నుండి కిందికి ధుమికి భీష్ముని చంపటానికి
చక్రము చేత బట్టి వెళుతున్నపుడు అర్జునుడు
వద్దు భావ నీవు వేళ్ళ వద్దు నా మర్యాద తీయవద్దు అని కృష్ణ పరమాత్మను వెనక్కి
తీసుకెళుతున్న సందర్భమున పోతన వ్రాసిన

భాగవతం

సీ ll
కుప్పించి యెగచిన కుండలంబుల కాంతి
        గగన భాగంబెల్ల గప్పి గొనగ
నురికిన నోర్వక నుదరంబు లోనున్న
        జగముల వ్రేగునా జగతి గదల
చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున
         పైనున్న పచ్చని పటము జార
నమ్మితి నాలావు నగుబాటు సేయక
      మంనింపుమని క్రీడి మరలి దిరుగ

తే. గీ
గరికి లంఘించి సింహంబు కరిణి మెరిసి
నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు
విడువు మర్జున యనుచు మద్వి శిఖ వృష్టి
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు l l

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం