ఆ.వె ఆడపిల్ల

ఓం

ఆ.వె
ఆడపిల్ల లేని అతిథి మర్యాదేది
ఆడపిల్ల లేని అన్న మేది
ఆడపిల్ల నీకు ఐశ్వర్య మిచ్చురా
ఆడపిల్ల లన్న అలుసు వలదు l l

ఆ.వె.
ఆడపిల్ల సృష్టి ఆదిమూలము నౌర
ఆడ పిల్ల నీకు ఆలి యౌర
కడకు జన్మనిచ్చె కన్న తల్లియు కూడ
ఆడ పిల్ల నేర యందరికిని l l

ఆ.వె
అడపిల్ల ప్రేమ అనురాగం పెంచుకో
పెంచు కొన్న మమత పంచు కొమ్ము
ఆడ పిల్ల నిల్లు ఐశ్వర్య రూపంబు
పిల్ల లేని ఇల్లు పెంట కుప్ప l l

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం