నేతన్న మీ కష్టం ఎంత అన్న పాట
నేతన్న నీ కష్టం ఎంత అన్న
వస్త్ర కళాకారుడన్న నేతన్న వనిత
కట్టు కోక సృష్టికి మూలము నీవన్నా l l
లయబద్ధముగా నువ్వు మగ్గమున్ నేయుచు
సంగీత సవ్వడుల కళను వినిపిస్తావు
రకరకాల రంగుల మెరుపులతో చీరకు
పైట కొంగు హంగు లేసి ప్రాణము పోస్తావు
చీర అంచులోన చిత్రాలను చూపుతావు
ఏనుగులు నెమల్లు ఎన్నెన్నో అందులో
అన్నిటికి అంగముల అందాలను దిద్దుతావు
అగ్గిపెట్టే లోన చీర అమరగ చేస్తావు l l
ఎండ్రుకలా సన్నని ఎన్నొవేళ పొగులతో
పడుగు పాక చుట్టి అతుకులతో అచ్చతికి
ఊసలతో కండే జేసి కొమ్ములో నదిమిపెట్టి
చటా పటా రాగ తాల ధ్వనులుతోన నేస్తావుl l
తరతరాల వృత్తిని వారసత్వ మని ఎంచి
కూలి చాలకున్న కులవృత్తిని వదులు కోక
కులవృత్తికి ధీటు లేదు గువ్వల చెన్నాయంచు
మానకుండ మగ్గముతో మనుగడ సాగిస్తావు l l
రచన.
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240
వస్త్ర కళాకారుడన్న నేతన్న వనిత
కట్టు కోక సృష్టికి మూలము నీవన్నా l l
లయబద్ధముగా నువ్వు మగ్గమున్ నేయుచు
సంగీత సవ్వడుల కళను వినిపిస్తావు
రకరకాల రంగుల మెరుపులతో చీరకు
పైట కొంగు హంగు లేసి ప్రాణము పోస్తావు
చీర అంచులోన చిత్రాలను చూపుతావు
ఏనుగులు నెమల్లు ఎన్నెన్నో అందులో
అన్నిటికి అంగముల అందాలను దిద్దుతావు
అగ్గిపెట్టే లోన చీర అమరగ చేస్తావు l l
ఎండ్రుకలా సన్నని ఎన్నొవేళ పొగులతో
పడుగు పాక చుట్టి అతుకులతో అచ్చతికి
ఊసలతో కండే జేసి కొమ్ములో నదిమిపెట్టి
చటా పటా రాగ తాల ధ్వనులుతోన నేస్తావుl l
తరతరాల వృత్తిని వారసత్వ మని ఎంచి
కూలి చాలకున్న కులవృత్తిని వదులు కోక
కులవృత్తికి ధీటు లేదు గువ్వల చెన్నాయంచు
మానకుండ మగ్గముతో మనుగడ సాగిస్తావు l l
రచన.
యలిగండ్ల నాగరంగయ్య
తాడిపత్రి 9866068240
Comments
Post a Comment