ముక్కంటీశ్వర స్తుతి
అంశము: ముక్కంటి
కొండశిఖరముపైన కొలువున్న శివలింగ!
జగతి గతి తప్పినది జరిపించు పదిలంగ!
నగరాజు సిగనుండి దిగ దుమికె సిరి గంగ
పాపాల కడిగేయ ప్రజలంత మునుగంగ
సిగ నగై తొగరాజు ధగధగా మెరియంగ
ఇగకొండ వాసమై జగమేలు శివలింగ!
వీరగణములు నిన్ను చేరి నుతి గొలువంగ
నటరాజువై పూని నర్తించెదవు లింగ!
నీయాజ్ఞ లేనిదిల నేమి జరగదు లింగ!
విషక్రిమి కరోనాను విడిచితివి ఇల ఏల l l
క్రిమిననచి మముగాచి కృపజూడు భసితాంగ!
నందివాహన లింగ! గంధ లేపన లింగ!
మాలింగ! మరు భంగ! మంగళాకృతి లింగ!
ఉత్తుంగ! ధవళాంగ! ఉత్తమోత్తమ జంగ!
తొగరాజు = చంద్రుడు
ఇగ కొండ= హిమగిరి
అడచి = చంపి
మరుభంగ= మన్మథున్ని చంపినవాడ
రచన. డాక్టర్
అడిగొప్పుల సదయ్య
జమ్మికుంట కరీంనగర్
కొండశిఖరముపైన కొలువున్న శివలింగ!
జగతి గతి తప్పినది జరిపించు పదిలంగ!
నగరాజు సిగనుండి దిగ దుమికె సిరి గంగ
పాపాల కడిగేయ ప్రజలంత మునుగంగ
సిగ నగై తొగరాజు ధగధగా మెరియంగ
ఇగకొండ వాసమై జగమేలు శివలింగ!
వీరగణములు నిన్ను చేరి నుతి గొలువంగ
నటరాజువై పూని నర్తించెదవు లింగ!
నీయాజ్ఞ లేనిదిల నేమి జరగదు లింగ!
విషక్రిమి కరోనాను విడిచితివి ఇల ఏల l l
క్రిమిననచి మముగాచి కృపజూడు భసితాంగ!
నందివాహన లింగ! గంధ లేపన లింగ!
మాలింగ! మరు భంగ! మంగళాకృతి లింగ!
ఉత్తుంగ! ధవళాంగ! ఉత్తమోత్తమ జంగ!
తొగరాజు = చంద్రుడు
ఇగ కొండ= హిమగిరి
అడచి = చంపి
మరుభంగ= మన్మథున్ని చంపినవాడ
రచన. డాక్టర్
అడిగొప్పుల సదయ్య
జమ్మికుంట కరీంనగర్
Comments
Post a Comment